ఓ యువతి నడి రోడ్డు పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో వీరంగం
- February 10, 2018
సిటీలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు... మందుబాబులు చుక్కలు చూపిస్తున్నారు. మందేసి రోడ్డెక్కిందే కాకుండా... ఖాకీలతో గొడవ పడుతున్నారు. మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ... పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. నిన్న అర్ధరాత్రి కూడా చాలాచోట్ల ట్రాఫిక్ సిబ్బందితో మందుబాబులు ఆటాడుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు సహకరించకుండా... మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు.
మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌లో ఢిల్లీకి చెందిన ఓ యువతి వీరంగం సృష్టించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై విరుచుకుపడింది. మీ సంగతి చూస్తానంటూ... కెమెరాలను లాక్కొనేందుకు ప్రయత్నించింది. ఆమెతో ఉన్నవారు వారిస్తున్నా వినిపించుకోకుండా... మీడియా ప్రతినిధులపైకి దూసుకొచ్చి నానా రభస చేసింది.
నిన్న రాత్రి నగరంలో ఏడు ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 39 మందిపై కేసులు నమోదు చేసి... వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







