నితిన్‌-పవన్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్

- February 10, 2018 , by Maagulf
నితిన్‌-పవన్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ రిలీజ్

నితిన్‌-పవన్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అంటే నితిన్‌కు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నితిన్‌ నటిస్తున్న సినిమాకే పవన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్‌ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'ఛల్‌ మోహన్‌రంగ' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు పవన్‌తో పాటు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో నితిన్‌, మేఘా ఆకాశ్‌లు గంతులేస్తుండడం ఆకట్టుకుంటోంది. 'లై' సినిమా తరువాత నితిన్‌, మేఘా కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. పీకే క్రియేటివ్‌ వర్క్స్‌, శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరోవైపు నితిన్‌ 'శ్రీనివాస కల్యాణం' సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాతో దాదాపు 14 ఏళ్ల తరువాత నితిన్‌..దిల్‌రాజుతో కలిసి పనిచేస్తున్నారు. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com