ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్
- February 10, 2018
అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులకు ఇక గ్రీన్ కార్డు కష్టాలు తీరనున్నాయి. ట్రంప్ ప్రతిపాదించిన వలస విధానం అమల్లోకి వస్తే... నిపుణులైన ఉద్యోగులకు గ్రీన్ కార్డు ఆలస్యానికి తెరపడనుందని అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలిపింది. కోటావారీగా వివిధ దేశాలకు గ్రీన్ కార్డుల కేటాయింపులు రద్దు చేయాలంటూ గత వారం రోజులుగా ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తూ వైట్ హౌస్ ముందు ఆందోళనకు దిగారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు వాషింగ్టన్ కు చేరుకొని ట్రంప్ సర్కారు, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్నారైల నుంచి వ్యక్తమవుతున్న నిరసన నేపథ్యంలో వైట్ హౌస్ ఈ ప్రకటన జారీచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత వలస విధానం కారణంగా హెచ్ 1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే కనీసం 70 ఏళ్లు పట్టనుంది. తాజాగా ట్రంప్ తీసుకొస్తున్న నూతన విధానం వల్ల లాటరీ విధానానికి స్వస్తి పలికి, ప్రతిభకు పట్టం కట్టనున్నారు. దీనివల్ల ప్రతిభ కలిగిన భారతీయులు గ్రీన్ కార్డుకోసం నిరీక్షించే సమయం తగ్గనుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







