'ఆర్జీవీ' పేరుతో సరికొత్త కాక్టైల్

- November 26, 2015 , by Maagulf

 

హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ లోని "కాక్టైల్స్ లాంజ్" రెస్టారెంట్ లో "ఆర్జీవీ ఎలిక్జిర్" పేరిట కొత్త కాక్టైల్ నేడు ప్రారంభమయింది. ఈ కాక్టైల్ ను ప్రతి తెలుగువాడు గర్వించే జాతీయస్థాయి సినీదర్శకులు రాం గోపాల్ వర్మ కి గౌరవసూచికంగా ప్రారంభిస్తున్నట్టు "కాక్టైల్స్ లాంజ్" యాజమాన్యం తెలిపింది. 

ఆ రెస్టారెంట్ అధినేత రామరాజు మాట్లాడుతూ, "సుప్రసిధ్ధ సినీ దర్శకులు, నవతరం స్ఫూర్తిదాయకులు శ్రీ రాం గోపాల్ వర్మ గారి చేతుల మీదుగా ఆయన పేరుతో, సినీ ప్రముఖుల మధ్య ఈ "ఆర్జీవీ ఎలిక్జిర్" అనే కాక్టైల్ మా రెస్టారెంట్ లో ప్రారంభం కావడం మాకు గర్వదాయకం. ఈ కాక్టైల్ కి నామకరణం చేసిన "వోడ్కా విత్ వర్మ" రచయిత సినీ కవి సిరాశ్రీ గారికి, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన కళామందిర్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు" అన్నారు. 

ఈ వేడుకలో సినీదర్శకులు కృష్ణ వంశీ, జేడీ చక్రవర్తి, కోనా వెంకట్, బ్రహ్మాజీ, నిఖిల్, సందీప్ కిషన్, నవదీప్, రాజ్ తరుణ్, నందు, బీవీయస్ రవి, పృథ్వీ, సత్యం రాజేష్, సప్తగిరి, రాజా రవీంద్ర, శ్రీనివాస రెడ్డి, లగడపాటి శ్రీధర్, మధుశాలిని, తేజశ్వి, నికిత, స్వాతి, అనితా చౌదరి, డా గజల్ శ్రీనివాస్, సుబ్బరాజు, మధుర శ్రీధర్, రాజ్ కందుకూరి, సిరాశ్రీ, కళామందిర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com