మహేష్ రాజేసిన చిచ్చు
- February 16, 2018
మనకు బాగా కావాల్సిన వారి లోపాలను మనం అంత త్వరగా ఎత్తిచూపలేం.. వాళ్లు ఏమైనా ఫీలైతే మళ్లీ మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఒకవేళ ఏమైనా చెప్పాల్సి వచ్చినా నవ్వుతూ చెప్పి తప్పించుకుంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు మహేశ్ బాబు కూడా అదే దారిని ఎంచుకున్నాడా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. మంజుల తీసిన మనసుకు నచ్చింది ప్రమోషన్లో అక్కకు సాయం చేస్తున్నాడు సూపర్‌స్టార్. అల్రెడీ సినిమా స్టార్టింగ్‌లో వచ్చే వాయిస్ ఓవర్ మహేశ్‌దే. ఇక లేటేస్ట్‌గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్క అంటే తనకు ఎంతో ఇష్టమో.. అక్క టేస్ట్.. అక్క లైఫ్‌స్టైల్ ఇలా ఒక్కటేంటీ.. ఎంత కుదిరితే అంతలా మంజులను మోసేశాడు మహేశ్.
సరిగ్గా ఇలాంటి టైంలోనే అక్కకి షాకిచ్చాడు ప్రిన్స్. "మంజుల ఆంటీతో సినిమా చెయ్యవా అని ఒకసారి గౌతం నన్ను అడిగాడని.. దానికి మీ ఆంటీతో సినిమా చేస్తే అదే నా చివరి సినిమా అవుతుందని అన్నాని చెప్పాడు మహేశ్..
అంటే ఇక్కడ మీనింగ్ ఏంటీ..? అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్క టేకింగ్ తెలిసే ప్రిన్స్ ఇలా అన్నాడని సోషల్ మీడియాలో ప్రేక్షకులు కౌంటర్లు వేస్తున్నారు. ఇక మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది మూవీకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది.
"తెలీని విషయాల్లో వేలు పెడితే... ఆ విషయమూ పాడవుతుందీ... వ్యవహారం రసాభాస అవుతుంది".. "నీకు నేచర్ అంటే ఇష్టమైతే ఫోటోలు తీస్కో..
నీకు మెడిటేషన్ తెలిస్తే చేసుకో" అంతే కానీ.. "నీ పిచ్చి మాపై రుద్ది మమ్మల్ని బలి చేయడం ధర్మమా..?" అంటూ నెటిజన్లు మంజులపై విరుచుకుపడుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







