ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి..
- February 18, 2018
సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు 61 మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంతరావు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అక్టోబర్ 10 , 1956 విజయవాడలో జన్మించిన అయన సుమారు 400 పైచిలుకు చిత్రాల్లో నటించారు. హనుమంతరావు సినిమాల్లోకి రాకముందు మిఠాయి వ్యాపారం చేసేవారూ. ఆ తరువాత 18 ఏళ్ల వయసులో "రావణబ్రహ్మ" నాటకంలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్ నటించిన "అహనా నా పెళ్ళంటా" చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. రాజేంద్రప్రసాద్ తో యమలీల , కొబ్బరిబోండం, రాజేంద్రుడు గజేంద్రుడు , వంటి హిట్ చిత్రాల్లో నటించి సినీ ప్రరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర సంచలన కామెడీ సీరియల్ "అమృతంలో" ఆంజనేయులుగా నటించారు. కాగా గుండు హనుమంతరావు మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







