కువైట్ ఆమ్నెస్టీ--APNRT సహాయక చర్యలు

- February 19, 2018 , by Maagulf

కువైట్ నుండి ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) ద్వారా తిరిగి వచ్చిన ప్రవాసులకు పలు సహాయ కార్యక్రమాలు మరియు భరోసా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.ముఖ్యమంత్రి ఆదేశం మేరకు NRI మినిస్టర్ కొల్లు రవీంద్ర మరియు APNRT ప్రెసిడెంట్ డాక్టర్ రవి కుమార్ వేమూరు, డైరెక్టర్ రాజశేఖర్ కువైట్ కు పయనం.3 రోజులు అక్కడే ఉండి మిగిలిపోయిన వారికి తక్షణ సహాయం అందించనున్నారు.


కువైట్ ప్రభుత్వ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) తో సుమారుగా 5,000 మంది ప్రవాసాంధ్రులు స్వరాష్ట్రానికి వస్తున్నారని అంచనా. అధిక శాతం కడప, గోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన చిరు ఉద్యోగులు ఉండటం గమనార్హం. 

జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్ళి, అక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ, అక్కడి చట్టాలు తెలియక, ఫైన్ లు కట్టలేక కువైట్ లో అనధికారికంగా బ్రతుకుతున్న ప్రవాసులు ఎటువంటి ఫైన్ లు చెల్లించనవసరం లేకుండా స్వదేశానికి వెళ్ళవచ్చునంటూ కువైట్ ప్రభుత్వం చేసిన ఆమ్నెస్టీ ప్రకటన ను విని వేలాదిగా ప్రవాసులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. 

దీనికి సంబంధించిన వివరాలను NRI మినిస్టర్ కొల్లు రవీంద్ర, APNRT ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరు రవి కుమార్, APNRT CEO కె. సాంబశివరావు  మరియు APNRT Director చప్పిడి రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి విడతల వారిగా కలిసి వివరించడం జరిగింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి  కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కి వీరిని ఆదుకోవలసింది గా లేఖ రాయడం జరిగింది.

కానీ నేటి వరకు కూడా ఎటువంటి సమాధానం రానందున, కేవలం 3 రోజులు మాత్రమే ఈ ఆమ్నెస్టీ గడువు ఉండటం తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, NRI మినిస్టర్ కొల్లు రవీంద్ర ని, APNRT ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరు రవి కుమార్ ని, మరియు APNRT Director చప్పిడి రాజశేఖర్ ని కువైట్ కు వెళ్లి తక్షణం ఆదుకోవలసింది గా ఆదేశించారు. అదే విధంగా ఆమ్నెస్టీ తో కువైట్ నుండి తిరిగి వచ్చిన ప్రవాసాంధ్రులకు తక్షణ వెసులుబాటు కార్యక్రమాలు చేపట్టమని ఎపిఎన్నార్టి కి ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశానుసారం వీరు ఫిబ్రవరి 19 రాత్రి బయలుదేరి కువైట్ కు 20 వ తేది చేరుకొని 2 రోజుల పాటు అక్కడే ఉండి, కువైట్ లో మిగిలిపోయిన తెలుగు వారికి చేయూతనిస్తారు.

ప్రవాసాంధ్రులకు తక్షణ వెసులుబాటు కల్పనలో భాగంగా ఎపిఎన్నార్టి సొసైటీ, కువైట్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన వారిని నిలబెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా మెరుగైన నైపుణ్యాభివృద్ది శిక్షణను, సరిక్రొత్త నైపుణ్యాలను నేర్చుకునే సదవకాశాన్నికల్పిస్తున్నారు. ఈ శిక్షణా తరగతులకు హాజరైన ప్రవాసాంధ్రులకు 3 నెలల పాటు జీవన భృతి అందించనున్నట్లు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

అంతేగాక, ప్రవాసాంధ్రుల తక్షణ జీవనోపాధి కోసం ప్రవాసాంధ్రులు అధికంగా ఉన్న ప్రాంతాలలో జాబ్ మేళా లను నిర్వహించమని APSSDC ని చంద్రబాబు నాయుడు  ఆదేశించారు. వీటితో పాటు కువైట్ నుండి తిరిగి వచ్చిన వారికి మరిన్ని ఉచిత శిక్షణలు ఇచ్చి స్వయంగా జీవనోపాధి కల్పన కు పలు రాయితీల ద్వారా ప్రోత్సహిస్తామని తెలిపారు. 

కువైట్ నుండి తిరిగి వచ్చిన ప్రవాసాంధ్రులు మరిన్ని వివరాల కోసం, మరియు రిజిస్ట్రేషన్ కొరకు ఎపిఎన్నార్టి హెల్ప్ లైన్ నంబర్ 00 91 863-2340678 కు ఫోన్ ద్వారా, 00 91 85000 27678 నంబర్ కు వాట్సప్ ద్వారా మరియు www.apnrt.com/kuwait ద్వారా సంప్రదించవలెనని APNRT ప్రెసిడెంట్ డాక్టర్ రవి కుమార్ వేమూరు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com