అలనాటి అతిలోక సుందరి ఇక లేరు
- February 24, 2018
దుబాయ్:బాలీవుడ్ నటుడు మొహితా మార్వా వివాహం కోసం యుఎఇలోని రాస్ అల్ కైమా వెళ్లిన నటి శ్రీదేవి శనివారం రాత్రి 11 నుంచి 11.30 గంటల మధ్య తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. శ్రీదేవి మరణవార్త తెలిసిన వెంటనే ముంబై నుంచి దుబాయ్ బయలుదేరిన ఆమె మరిది సంజయ్ కపూర్ ఈ విషయం చెప్పారు.
తమ అభిమాన నటి శ్రీదేవి ఇక లేరని తెలియగానే సినిమా రంగంతో పాటు, ఆమె అభిమానులంతా తీవ్ర విషాదానికి లోనయ్యారు. కేవలం 54 ఏళ్ళ వయసులోనే ఆమె దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తూ శ్రీదేవితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
భారత సినిమా రంగంలోని నటీమణుల్లో తొలిసారి సూపర్ స్టార్ హోదా దక్కించుకున్న హీరోయిన్ శ్రీదేవి. మరీ ముఖ్యంగా దక్షిణాది నుంచి వెళ్ళి బాలీవుడ్‌ను ఏలిన ఘనతను శ్రీదేవి దక్కించుకున్నారు.
తాజా వార్తలు
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!







