జిమ్నాస్టిక్ ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి రికార్డు
- February 24, 2018
మెల్‌బోర్న్: రెండేళ్ల క్రితం వరకు ఈ పేరు పెద్దగా పరిచయంలేని ఆట. 2016లొ జరిగిన రియో ఒలింపిక్స్‌్‌లో దీపా కర్మాకర్ భారత దేశం తరుపున ఈపోటీల్లో పాల్గొంది. ఫైనల్లో తృటిలో పతకాన్ని కోల్పోయినా దీప దేశానికే ఈ క్రీడను మరోసారి పరిచయం చేసింది. సుమారు 52ఏళ్ల తర్వాత జిమ్నాస్టిక్స్ విభాగంలో దేశం తరుపున ప్రాతినిధ్యం వహించిన మహిళగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జిమ్నాస్టిక్ ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి.
ఈ పోటీల్లో భారత్‌కు చెందిన అరుణ రెడ్డి కాంస్య పతకం గెలిచింది. జిమ్నాస్టిక్ ప్రపంచకప్ 2018లో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్దా అరుణ రెడ్డి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం జరిగిన టోర్నీ ఫైనల్లో అరుణ 13,469 పాయింట్లతో వాల్ట్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ రెండ్‌లో ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్స్‌లో 11,466 పాయింట్లు సాధించి ఫైనల్‌కు చేరిన అరుణ.తుదిపోరులో అద్భుత ప్రదర్శతో మెరిసింది. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌కి మొత్తం 16దేశాల నుంచి అథ్లెట్స్ ప్రాతినిథ్యం వహించగా.గత రెండు రోజుల నుంచి క్వాలిఫయింగ్ రౌండ్స్ జరిగాయి. వాల్ట్ క్వాలిఫయింగ్‌లో 13,566 పాయింట్లతో రెండో స్థానం దక్కించుకున్న అరుణ.
శుక్రవారం చివరి స్థానం (8వ స్థానం)లో ఫైనల్‌కు ప్రవేశించి కాంస్య పతకం చేజిక్కించుకోవడం విశేషం. స్లొవేకియాకు చెందిన జస కిస్లెఫ్ (13,800) స్వర్ణం గెలుచుకోగా.ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలి వైట్ హెడ్ (13,699) రజతం దక్కించుకుంది. ఇదే ఈవెంట్‌లో మరో భారత అమ్మాయి ప్రణతి నాయక్ (13,416) ఆరో స్థానంలో నిలిచారు. జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో భారత్ తరుపున పతకం గెలిచిన తొలి మహిళగా 22 ఏళ్ల అరుణ చరిత్ర సృష్టించింది. అరుణ హైదరాబాద్‌కు చెందిన అమ్యాయి. కరాటేలో అరుణ బ్లాక్‌బెల్ట్ సాధించింది. అంతేకాదు గతంలో ఆమె కరాటే శిక్షకురాలిగా కూడా పనిచేశారు. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో అరుణ అర్హత పోటీల్లో 14వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆసియా గేమ్స్‌లో 9వ స్థానంలో నిలిచిన మన తెలుగమ్యా యి.2017లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.
తాజా వార్తలు
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







