ధూమపానానికి బానిసలు కావడానికి కారణాలేంటి?

- November 27, 2015 , by Maagulf
ధూమపానానికి బానిసలు కావడానికి కారణాలేంటి?

మనిషి ఆశలకు హద్దే ఉండదు. మనిషి మనస్సులో నిత్యం ఏదో ఒక ఆశ సరికొత్తగా పుడుతూనే ఉంటుంది. దాని గోడు వినేవరకూ గోల చేస్తూనే ఉంటుంది. ఒక్కసారి మనస్సు మాట విని ఆ ఆశను తీర్చుకోవటానికి ప్రయత్నిస్తే తర్వాత అది కాస్త అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటు మంచిదైతే పర్వాలేదు, కానీ చెడ్డదైతే... ఓ వ్యసనమై కూర్చుని విసిగిస్తుంది. 'వ్యసనం ఏడూళ్ల పయనం' అని ఓ సామెత కూడా ఉంది అది మీకు తెలుసో లేదో. అది ఎంత దూరమైన పరుగులు పెట్టిస్తుంది. ఎంతపనైనా చేయిస్తుంది. ఆలోచనను నియంత్రించకపోతే మనసు అదుపు తప్పుతుంది. మాటను నియంత్రించకపోతే మనవారికి మనల్ని దూరం చేస్తుంది... చేతలను నియంత్రించకపోతే గౌరవం చేజారిపోతుంది... కానీ అలవాట్లను నియంత్రించకపోతే జీవన గమనమే మారిపోతుం ది.. ఇటువంటి చెడ్డ అలవాట్లలో ఒకటి ధూమపానం. ధూమపానం వల్ల మనిషికి ఎన్నో అనారోగ్యాలు ఏర్పడుతున్నా అతను ఈ వ్యసనం బారి నుండి దూరంగా ఉండలేకపోతున్నాడు. స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్ అని తెలిసీ కూడా ధూమపానంను ఎదేచ్చగా..ఎంజాయ్ చేస్తున్నారు. కొంత మంది మానేయాలకున్నా అది మానలేకపోతున్నారు. ఒక్క సారి అలవాటు పడ్డ తర్వాత మానలేకపోతున్నారు? ఎందుకనీ అంతగా అడిక్ట్ అవుతున్నారు? సిగరెట్ లో ఉన్న రహస్యం ఏంటీ? సిగరెంట్ మానకలేకపోవడానికి ముఖ్య కారణం బ్రెయిన్ కెమిస్ట్రీ(రసాయనిక చర్య), బాధ్యత వహిస్తుందని నిపుణుల యొక్క అభిప్రాయం. మరియు సిగరెట్ లో ఉండే నికోటిన్ మరియు టుబాకో...కూడా అడిక్టి అయ్యేదుకు ముఖ్య కారణం... టుబాకో ఎందుకు కారణం అవుతుంది? ఎందుకంటే అందులో 3000 పైగా కెమికల్స్ ఉంటాయి?కొన్ని ప్రత్యేకమైన పరిశోధనల ప్రకారం ప్రపంచంలోని ఇతర ప్రమాదకరమైన డ్రగ్స్ కంటే స్మోకింగ్ అత్యంత ప్రమాధకరమైనదని నిర్ధారిస్తున్నారు. మానవ శరీరంను ఇతర వ్యాధుల కంటే స్మోకింగ్ ఒక్క అలవాటు వల్ల మానవ శరీరం ఎక్కువగా డ్యామేజ్ అవుతున్నదని, అందుకే కొన్ని మిలియన్ల సంఖ్యలో స్మోకింగ్ చేసే వారు మరణిస్తున్నారని పలు పరిశోధనలు తెలుపుతున్నాయి..మరి ఈ ఆర్టికల్లో స్మోకింగ్ కు అడిక్ట్ అవ్వడానికి అనాటమీ(మానవ నిర్మాణ శాస్త్రం)ఎం చెబుతుందో చూద్దాం...  నికోటిన్ ఒక స్లోపాయిజన్ లాంటి డ్రగ్. కాబట్టి, ఇది క్రమంగా మనస్సు మీద ప్రభావం చూపుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం కొకైన్ మాదిరే నికోటిన్ కూడా వ్యసనపరులుగా మార్చేస్తుందని వెల్లడిస్తున్నారు. ఒక్క ఊదుడుతో, స్మోక్ చేసిన 7 సెకండ్లలో బ్రెయిన్ కు అందాల్సిన సమాచారం అందించేసి, ఒక్క క్షణం అహా! అన్నంత విశ్రాంతి ఫీలయ్యేలా చేస్తుంది. ఒక్కసారి స్మోక్ చేయడం మొదలెడితే ఇక ఒకదానికి తర్వాత మరొక పఫ్స్ లాంగించేస్తామా అన్నంత కోరికను కలిగిస్తుంది. ఒక వేళ త్రాగకూడదనుకొన్నా, మనస్సు మాత్రం ఊరుకోదు..దాంతో ఇది ఒక అలవాటుగా మరియు వ్యసనంగా మారిపోతుంది. సిగరెంట్ త్రాగడం మొదలు పెట్టిన కొన్ని రోజుల తర్వాత, ఇది వ్యక్తి దినచర్యలో ఒక భాగమైపోతుంది. బ్రెయిన్ చెప్పిన మాట వినకుండా స్వతంత్రగా తయారవుతుంది. వ్యక్తి ఆధీనం లేకుండానే సెకండ పర్సనాలిటీగా మారుతుంది. పక్కవారు ఎవరైనా స్మోక్ చేస్తుంటే మీ ప్రభావం లేకుండానే స్మోక్ చేయాలని బ్రెయిన్ ప్రోత్సహిస్తుంది. వెంటనే స్మోక్ చేయాలనిపిస్తుంది. స్మోకింగ్ వ్యక్తి దినచర్యలో ఒక భాగమైపోతుంది. మనస్సు తన ఆధీనం లేకుండానే, పక్కవారు ఎవరైనా స్మోక్ చేస్తుంటే మీ ప్రభావం లేకుండానే స్మోక్ చేయాలని పరితపిస్తుంటుంది. స్మోకింగ్ కు అలవాటు పడ్డాక ఒక స్టేజ్ దాటిన తర్వాత అది లేకుండా మీ జీవితం ముందుకు సాగదు. ఒక్క సారి స్మోకింగ్ కు అలవడితే స్మోకింగ్ లేకుండా జీవించలేము అన్న ఫీలింగ్ మీకు కలగవచ్చు. వంశపారంపర్యంగా ఎవరికైనా డిప్రెషన్, స్ట్రెస్ ఉన్నట్లైతే, స్మోకింగ్ చేసే వారు, ఈ అలవాటును మానుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇతరులతో పోల్చినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారిలో ఈ అలవాటు ఎక్కుగా ఉంటుంది. పార్టీలు, ఫంక్షన్స్ ను స్మోక్ చేసేవారిని చూసి వారికి ఆకర్షితులై, స్టైల్ కోసమనో, లేదా ఇతరుల కోసమనో స్మోక్ చేయడం ప్రారంభిస్తారు. మొదటలో బాగున్నా తర్వాతర్వాత అది ఒక అలవాటుగా, వ్యసనంగా మారుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com