పైరసీని అరికట్టేందుకు ఓ వినూత్న ప్లాన్-కమల్

- November 27, 2015 , by Maagulf
పైరసీని అరికట్టేందుకు ఓ వినూత్న ప్లాన్-కమల్

ఉలగనాయగన్ కమల్ నటించిన చీకటి రాజ్యం చిత్రం ఇటీవలే తెలుగులో విడుదలయిన సంగతి తెలిసిందే.తమిళంలో తూంగవనం అనే టైటిల్ తో దీపావళి కానుకగా విడుదలయింది.అయితే ఈ చిత్రం విడుదలయి వారం కాకముందే ఈ చిత్రాన్ని మరో సారి రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు కమల్ .ఒక్కసారి విడుదలైన సినిమాను మళ్ళీ విడుదల చేయటమేంటనే కదా మీ డౌట్ కమల్ నటించిన తూంగవనం చిత్రం యాక్షన్ మూవీగా తెరకెక్కగా ఈ చిత్రం ఇప్పటికే నెట్ లో చక్కర్లు కొడుతుందట.ఈ విషయాన్ని తెలుసుకున్న కమల్ పైరసీను అరికట్టేందుకు ఓ వినూత్న ప్లాన్ వేశాడు.తూంగవనం చిత్రాన్ని డిసెంబర్ 4 న ఇంటర్నెట్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.హెచ్ డీ క్వాలిటీతో 5.1 సరౌండ్ సిస్టమ్ తో ఈ సినిమాను ఆన్ లైన్ లో చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు కమల్ .అయితే ఆన్ లైన్ లో చూసేందుకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గతంలో విశ్వరూపం సినిమాను థీయేట్రికల్ రిలీజ్ తో పాటు డీటి ఎచ్ లోను విడుదల చేయాలని భావించగా,ఆ ప్రయత్నం విఫలమైంది.కాని ఈ పైరసీ భూతం వల్ల చీకటి రాజ్యం సినిమాకు కమల్ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.మరి ఈ లోకనాయకుడు రానున్న రోజుల్లో ఇంకెన్ని సాహసాలు చేస్తాడో చూడాలి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com