రవికుమార్ పనస: సామాన్యుడేగానీ, అసామాన్యుడు!
- March 01, 2018
ఓ సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి, అంచలంచెలుగా ఎదిగి, సినీ పరిశ్రమలో తనదైన ప్రత్యేకతను చాటుకోవడమంటే చిన్న విషయం కాదు. అలాంటి అసాధ్యాల్ని సుసాధ్యం చేసిన అతికొద్దిమందిలో రవికుమార్ పనస ఒకరు. నల్గొండ జిల్లాలోని ఓ ఎమ్మార్వో తనయుడైన రవికుమార్ పనస, అనుకోకుండా సినీ పరిశ్రమలోకి వచ్చారు. అయితే డైరెక్ట్‌గా సినీ పరిశ్రమతో సంబంధాల్లేకపోయినా, ఆ సినిమా రంగం పట్ల ఆకర్షితులై, క్రమంగా సినీ పరిశ్రమలోకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అడుగు పెట్టారు. త్వరలో బాలీవుడ్ లో ప్రముఖ హీరో,డైరెక్టర్ తో సినిమా నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.సినిమా నిర్మాణంతోపాటు, ఆర్కె ప్రమోషన్స్ పేరుతో బ్రాండ్ అండార్స్మెంట్, పబ్లిక్ రిలేషన్స్, ఔట్ డోర్ పబ్లిసిటీ, ఎలక్ట్రానిక్ మీడియా వంటి విభాగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు రవికుమార్ పనస. 'సూపర్ స్టార్ కిడ్నాప్', 'రామ్ లీలా', 'బెంగాల్ టైగర్' తదితర సినిమాల ప్రమోషన్స్‌ని ఆర్కె ప్రమోషన్స్ చేపట్టింది. పలువురు హీరోలు, హీరోయిన్లకు పీఆర్వోగానూ రవికుమార్ పనస పనిచేసి, సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తున్నారు. మొట్టమొదటగా తనకు సినిమాలపై ఆసక్తి ఏర్పడటానికి కారణమైన 'శివ' సినిమాకి దర్శకత్వం వహించిన రామ్‌గోపాల్ వర్మలోని 'ఆర్', ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'గులాబీ' సినిమా తనను అమితంగా ఆకట్టుకోవడంతో కృష్ణవంశీ పేరులోని 'కె', 'బద్రి' సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్‌లోని 'పి' అక్షరాల్ని తీసుకుని, తన కంపెనీ పేరుని ఆర్కెపి (ఆర్కె ప్రమోషన్స్)గా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. సిసిఎల్, సైమా వంటి మేజెర్ ఈవెంట్స్ నిర్వహణలో రవికుమార్ పనస తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. మెగా ఈవెంట్స్ నిర్వహణ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆర్కె ప్రమోషన్స్ అనే అభిప్రాయం సినీ వర్గాల్లో బలంగా విన్పిస్తుంటుంది. ఓ ప్రముఖ హీరోతో రియాల్టీ షోని కూడా ప్లాన్ చేస్తున్నారు రవికుమార్ పనస. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో 'టై అప్' అవడం ద్వారా బాలీవుడ్‌కీ, టాలీవుడ్‌కీ మధ్య అనుసంధానకర్తగానూ రవికుమార్ పనస వ్యవహరిస్తున్నారు. ఇటీవలే అతి ఖరీదైన జాగ్వర్ XJ కార్ ను ఖరీదు చేశారు.ఇప్పటి వరకు టాలీవుడ్ లో బన్నీ, ప్రభాస్ బాలీవుడ్ లో రణ్వీర్ తరువాత రవికుమార్ పనస కార్ ఖరీదు చేశారు.ఈ కార్ ఖరీదు షుమారు కోటి యాబై లక్షల రూపాయలు ఉంటుంది.భవిష్యత్తులో ప్రెస్టీజియస్ మూవీస్‌ని నిర్మించడం, అలాగే ప్రెస్టీజియస్ ఈవెంట్స్‌ని నిర్వహించడం వంటి లక్ష్యాలతో ముందడుగు వేస్తోన్న రవికుమార్ పనస మరిన్ని విజయాల్ని అందుకోవాలని ఆశిద్దాం.



తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







