ఆ బ్యానర్లోనే అల్లరి నరేష్ 55వ చిత్రం!
- March 04, 2018
కామెడీ కింగ్ అల్లరి నరేష్, టాప్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర కాంబినేషన్లో వచ్చిన "ఆహా నా పెళ్లంట, యాక్షన్ 3డి, జేమ్స్ బాండ్" చిత్రాలు మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాల అనంతరం అల్లరి నరేష్-అనిల్ సుంకరల కాంబినేషన్లో నాలుగో చిత్రం రానుంది. ఎ టీవి సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మాణ సారధ్యంలో "నందిని నర్సింగ్ హోమ్" చిత్రంతో దర్శకుడిగా తన అభిరుచిని చాటుకొన్న పి.వి.గిరి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు (మార్చి 4) హైద్రాబాద్ లో నిర్వహించబడ్డాయి. ఇది అల్లరి నరేష్ నటించే 55వ సినిమా కాగా.. నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించనున్న 15వ చిత్రమిది.
ఈ చిత్రానికి కెమెరా: నగేష్, కళ: గాంధీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సమర్పణ: ఎ టీవి, నిర్మాణం: ఏకే ఎంటర్ టైన్మెంట్స్, దర్శకత్వం: పి.వి.గిరి.
తాజా వార్తలు
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!
- సౌదీ అరేబియాలో స్థిరంగా ద్రవ్యోల్బణం..!!
- ఖర్జూర సాగు అభివృద్ధిపై అంతర్జాతీయ సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!







