భర్త హత్య కేసులో భార్యకి జైలు
- March 06, 2018
దుబాయ్:ఓ మహిళ, తన లవర్‌తో కలిసి భర్తను చంపిన కేసులో భార్యకి జైలు శిక్ష విధించగా, ఆమె లవర్‌కి మరణ శిక్ష విధించింది న్యాయస్థానం. నిందితురాలికి 15 ఏళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. కొమరోస్ ఐలాండ్స్‌కి చెందిన 33 ఏళ్ళ వ్యక్తిని అతని భార్య, భార్య లవర్ హత్య చేసినట్లుగా విచారణలో తేలింది. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని విచారణలో పోలీసులు నిర్ధారించారు. మహిళ, ఆమె లవర్ కలిసి బాధితుడికి చేతుల్ని కట్టేసి, కారులోకి నెట్టి, ఆ కారులోనే అతన్ని తీవ్రంగా కొట్టారు. అనంతరం దూరంగా తీసుకెళ్ళి, కారులోంచి తోసేసి, అతని మీదకు కారుని ఎక్కించేసి, మృతి చెందాడని నిర్ధారించుకున్నాక తమతో తెచ్చుకున్న ఫ్యూయల్‌ని మృతదేహంపై చల్లి, నిప్పు పెట్టారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. ఈ కేసులో తీర్పుని సవాల్ చేసేందుకు 15 రోజుల వ్యవధి నిందితులకు ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







