షార్జా-దుబాయ్ మధ్య ట్రాఫిక్ రద్దీ 2018 ముగిసే లోపే పరిష్కారం

- March 06, 2018 , by Maagulf
షార్జా-దుబాయ్ మధ్య ట్రాఫిక్ రద్దీ 2018 ముగిసే లోపే పరిష్కారం

యుఎఈ:షార్జా మరియు దుబాయ్ల మధ్య ట్రాఫిక్ రద్దీ ఈ సంవత్సరం చివరి నాటికి పరిష్కారం కానుందని  ఇకపై అదో సమస్య కాదని మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ అబ్దుల్లా బిన్ మహ్మద్ బెహీఫ్ అల్ నౌమిమి చెప్పారు. పలు ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతున్నాయని, దీంతో ఎమిరేట్స్ వాసులకు ట్రాఫిక్ రద్దీ సమస్యలు తొలిగిపోతాయని 200 మిలియన్ల ధిర్హాంల వ్యయంతో నిర్మితమయ్యే ఆల్ బుడయ్యా బ్రిడ్జ్ తో సహా 75 శాతం పూర్తయిందని అల్ ఖలీజ్ అరబిక్ డైలీకి ఒక ప్రకటనలో పేర్కొంది." 4 కిలోమీటర్ల ఎత్తులో  బాటిల్ నెక్ ఆకారంలో ఉన్న ఈ వంతెన ఈ ఏడాది ఆగష్టులో వాహనకారులకు అందుబాటులోనికి రానుందని  భావిస్తున్నామని మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రి అన్నారు, ఎమిరేట్స్ రోడ్ (ఇ 611) ను వాహనదారులు ఉపయోగించేందుకు సిద్ధం కానుందని చెబుతూ ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ట్రక్కుల కోసం ఎమిరేట్స్ రోడ్ లో ఒక ప్రత్యేకమైన  ట్రక్ లేన్ త్వరలోనే ఉపదేశించబడుతుందని పేర్కొన్నారు.  ట్రక్కుల కోసం పార్కింగ్ కోసం రెండు ప్రదేశాలుకేటాయించబడతాయన్నారు. ఆల్ ఇటిహాద్ రోడ్, మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్లకు 2021 ప్లాన్ లో భాగంగా ఈ ప్రాంతంలో నాల్గవ జాతీయ రహదారిని జోడించనున్నట్లు ఆయన తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com