దుబాయ్ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- March 06, 2018
కేరళకు చెందిన వ్యాపారవేత్త, దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ఆన్లైన్ టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన డ్రాలో ఆయన గెలుపొందారు. 40 ఏళ్ళ ప్రాబిన్ థామస్, భారతదేశానికి చెందిన వ్యక్తి. నెట్వర్కింగ్ బిజినెస్ నిర్వహిస్తోన్న ఆయన, కేరళలో ఐటీ ప్రోడక్ట్స్‌ని విక్రయిస్తుంటారు. 265 సిరీస్‌లోని 0471 టిక్కెట్‌పై ఆయనకు ఈ బంపర్ ప్రైజ్ తగిలింది. రెగ్యులర్‌గా లోకల్ లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసే థామస్, ఇంతకుముందెన్నడూ ఇలాంటి బహుమతి గెల్చుకోలేదు. 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న థామస్‌ని, ఈ సొమ్ముతో ఏం చేస్తారు? అనడిగితే, తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన దుబాయ్ డ్యూటీ ఫ్రీకి థ్యాంక్స్ చెప్పారు. దుబాయ్‌లోనే నివసిస్తోన్న ఇంకో ఇండియన్ అఫ్‌జాన్ జిల్లా, బిఎండబ్ల్యు ఆర్ 9 టి అర్బన్ జిఎస్ అనే ఖరీదైన బైక్‌ని సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







