షకీలా.. 'శీలవతి' టీజర్ విడుదల
- March 07, 2018
సెన్సేషనల్ స్టార్ షకీలా 250వ చిత్రంగా 'జి' స్టూడియోస్ సమర్పణలో, రాఘవ ఎమ్ గణేష్ మరియు వీరు బాసింశెట్టి నిర్మాతలుగా, సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శీలవతి'. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర యూనిట్. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా షకీలా మాట్లాడుతూ.. ''నా 250వ చిత్రంలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రం నాకు చాలా స్పెషల్. నెక్స్ట్ సీన్ ఏంటనేది.. అందులో నటించే నాకు కూడా తెలియకుండా స్క్రీన్ ప్లే ను ప్లాన్ చేసాడు దర్శకుడు. నిర్మాతలిద్దరూ సినిమా కోసం ఏం కావాలన్నా అందించారు. మే లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.
గీతాంజలి (ఫ్రూటీ) మాట్లాడుతూ.. ''షకీలా గారితో ఇది నా రెండవ చిత్రం. యంగ్ టీమ్ కలసి పని చేసిన సినిమా కనుక చాలా ఫాస్ట్‌గా ఇంట్రెస్టింగ్గా షూటింగ్ పూర్తి చేశాం. ఫైనల్‌గా సినిమా చాలా బాగా వచ్చింది. మీరంతా సినిమా చూసి ఆదరించాలని కోరుతున్నా'' అన్నారు.
నిర్మాత గణేష్ మాట్లాడుతూ.. ''మా బ్యానర్లో వస్తున్న మొదటి సినిమా ఇది. షూటింగ్ అంతా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే లో విడుదల చేయనున్నాము'' అన్నారు.
మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. ''ఇంతకు ముందు రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినా.. సంతృప్తి నిచ్చిన సినిమా మాత్రం 'శీలవతి'. నాకు, షకీలా గారికి మధ్య ఒక నిర్మాత, ఆర్టిస్ట్‌లా మొదలైన జర్నీ.. అక్కా.. తమ్ముడు అనుకునేంతగా బంధం ఏర్పడింది. తను చాలా సపోర్ట్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను'' అన్నారు.
దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ.. ''కెమెరామెన్ బెస్ట్ వర్క్‌ను ఇచ్చాడు. నిర్మాతలు ఇద్దరూ చాలా మంచి సపోర్ట్‌ను అందించారు. ఈ సినిమా చూశాక.. ఇంతకు ముందు షకీలా వేరు ఈ సినిమా తరువాత షకీలా వేరు అని మీరే అంటారు. ఈ సినిమాతో మంచి పేరొస్తుంది తనకు. ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ మరియు హార్రర్ కామెడీ జోనర్. తప్పకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది'' అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









