దుబాయ్ లాటరీ లో విజేతగా భారతీయుడు.. రూ.6.50 కోట్ల బహుమతి
- March 07, 2018
దుబాయ్: ఇటీవల పలు గల్ఫ్ లాటరీలు మన భారతీయులకు ఇబ్బడిముబ్బడిగా వరిస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉత్పత్తులు కేరళలో అమ్ముకొంటూ ఓ ఛోటా ఓ వ్యక్తిని లాటరీ కోటీస్వరుడిగా మార్చేసింది కేరళకు చెందిన 40 ఏళ్ల ప్రబిన్ థామస్ అనే వ్యక్తి దుబాయ్ లాటరీలో విజేతగా నెగ్గాడు అక్షరాలా రూ.6.50 కోట్లకుపైగా(1 మిలియన్ డాలర్లు) డబ్బు ఆ వ్యక్తికి దక్కనుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్ లక్కీ డ్రాలో థామస్ మొదటిసారిగా టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఓ పని నిమిత్తం దుబాయ్ వెళ్లిన ఆయన ఆన్‌లైన్లో ఓ టికెట్‌ను కొనుగోలు చేశాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో డ్రా తీయగా థామస్ కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ 0471కు లాటరీ దక్కిందని నిర్వహకులు మంగళవారం ప్రకటించారు. మొదటిసారిగా దుబాయ్ డ్యూటీ ప్రీ లాటరీలో టికెట్‌ను కొనుగోలు చేయగా అదృష్టం వరించిందని ప్రబిన్ థామస్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. లాటరీ నిర్వాహకులు థామస్‌కు చెక్‌ను అందజేశాడు. దీంతో థామస్ తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తానని, వీలైతే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపిస్తానని చెపుతున్నాడు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







