షార్జాలో కారు ప్రమాదం: వ్యక్తి మృతి
- March 09, 2018
షార్జా:షార్జాలోని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై తస్జీల్ విలేజ్ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. కారు సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో, రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆ వ్యక్తి నిలిపివేయగా, అదే మార్గంలో వేగంగా వచ్చిన మరో వాహనం, ఆ కారుని ఢీకొంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ పెట్రోల్స్ అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని అక్కడినుంచి తరలించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ - షార్జా పోలీస్, వాహనదారులు తమ వాహనాల్ని రోడ్డుపై ప్రత్యేక పరిస్థితుల్లో నిలిపివేయాల్సి వచ్చినప్పుడు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. ఎమర్జన్సీ సమయాల్లో 'యీల్డ్' సిగ్నల్ వినియోగించాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







