పైనాపిల్ తో ఆరోగ్య ప్రయోజనాలు..

- November 29, 2015 , by Maagulf
పైనాపిల్  తో ఆరోగ్య ప్రయోజనాలు..

కొంచెం తియ్యగా.. కొంచెం పుల్లగా.. తింటుంటే తినాలనిపించే పైనాపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. హెల్తీయెస్ట్ ఫ్రూట్ గా పైనాపిల్ కు పేరుంది. ఇందులో జీరో ఫ్యాట్, జీరో కొలెస్ట్రాల్, పుష్కలంగా విటమిన్ ఏ, బి, సీ, పొటాషియమ్, మాంగనీస్, కాపర్ ఉంటాయి. ప్రొటీన్స్, మినరల్స్, పోషకాలు మెండుగా ఉంటాయి. :గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్ష తినడం వల్ల పొందే గొప్ప ప్రయోజనాలు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి. అందులో అనాస పండు ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. దీనిలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ప్రయోజనాలతో నిండిన పైనాపిన్ కి ఇక్ పై నో చెప్పకండి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. పొందే 22 రకాల ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.విటమిన్ సీ మెండుగా ఉండే పైనాపిల్స్ రెగ్యులర్ గా తినాలి. శరీరానికి కావాల్సినంత విటమిన్ సీ అందినప్పుడే.. కీళ్ల నొప్పులను అరికట్టగలం. అంతేకాదు పైనాపిల్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పైనాపిల్స్ లో విటమిన్ సీ తోపాటు మాంగనీస్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనివల్ల ఎముకలకు శక్తి చేకూరుతుంది. లేటు వయసులో మహిళల్లో వచ్చే ఎముకల వ్యాధుల నుంచి కాపాడటానికి తోడ్పడుతుంది. ఒక కప్పు పైనాపిల్ జ్యూస్ ద్వారా 70 శాతం మాంగనీస్ అందుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ పైనాపిల్ ముక్కలు రోజూ తినడం వల్ల.. శరీరానికి కావలిన శక్తి అందుతుంది. సైనస్, అలర్జీలతో బాధపడే వాళ్లకు పైనాపిల్ చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే పోషకాలు.. గొంతు, ముక్కులో ఉండే శ్లేష్మంను అరికడుతుంది. ఒకవేళ మీకు సీజనల్ అలర్జీలు ఉంటే.. పైనాపిల్స్ ని మీ డైట్ లో చేర్చుకోండి. పైనాపిల్స్ లో ఉండే బ్రోమెలైన్ శరీరంలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. విమానాల్లో ప్రయాణించేవాళ్లు, ఎక్కువగా ప్రయాణించేవాళ్లకు బ్లడ్ క్లాట్స్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ.. కాబట్టి ఇలాంటి వాళ్లు నిత్యం స్నాక్స్ రూపంలో పైనాపిల్ తీసుకోవడం మంచిది. పైనాపిల్స్ లో రకరకాల బి విటమిన్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరు సరిగా ఉండేలా చేస్తుంది. ఒత్తడిని ఎదుర్కునే శక్తిని అందిస్తుంది. పైనాపిల్ లో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల.. కంటి సమస్యలు దరిచేరకుండా చూస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కంటిచూపు బాగుండటానికి ఇది ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. కాబట్టి ఈసారి ఎప్పుడైనా జబులు, దగ్గు వచ్చాయంటే.. ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగండి. వెంటనే రిలాక్స్ అయిపోతారు. పైనాపిల్స్ చాలా ఎక్కువ పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుంచి బయటపడేలా చేస్తాయి. పైనాపిల్స్ ని తినడం వల్ల పళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చిగుళ్లు గట్టిపడేలా చేస్తుంది. నోటి క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది. పైనాపిల్ లో మినరల్స్, విటమిన్స్ కాకుండా.. పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణ సరిగా జరిగేలా చూస్తుంది. దీంతో బీపీ కంట్రోల్ లో ఉంటుంది. జీర్ణక్రియలో సమస్యగా ఉంటే.. మీ రెగ్యులర్ డైట్ లో పైనాపిల్స్ ని చేర్చుకోండి. ఫైబర్, విటమిన్ సి వంటివి జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా చేస్తాయి. గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్ నెస్ లో భాగంగా వికారంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ తాగండి. విరేచనాలతో బాధపడుతున్నప్పుడు కూడా.. పైనాపిల్ జ్యూస్ తరచుగా తాగుతూ ఉండాలి. దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు పైనాపిల్ జ్యూస్ తీసుకుంటూ ఉండే మంచిది. మొటిమలతో బాధపడుతున్నప్పుడు పైనాపిల్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్ తో పాటు.. ఎంజైమ్స్ ఉండటం వల్ల.. జ్యూస్ లాగా తీసుకున్నా మంచిది.. ఫేస్ ప్యాక్ లా వేసుకున్నా.. మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా పసుపు తీసుకుని.. పైనాపిల్ పేస్ట్ లో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల.. మొటిమలు తగ్గిపోతాయి. గరుకుగా, నొప్పిగా ఉండే పాదాలకు పైనాపిల్ చక్కటి పరిష్కారం. పైనాపిల్ తో స్క్రబ్ చేయడం వల్ల.. పాదాలు మృదువుగా.. మెరుపుస్తూ మారుతాయి. విటమిస్ ఏ, బీ లోపం ఉంటే గోళ్లు విరిగిపోవడం, చీలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి గోళ్ల ఆరోగ్యానికి పైనాపిల్ ఉపయోగపడుతుంది. పైనాపిల్ తో మసాజ్ చేయవచ్చు.. లేదా రెగ్యలర్ గా తిన్నా సరిపోతుంది. కొబ్బరి నూనెలో పైనాపిల్ కలిపి.. పెదాలకు రాయడం వల్ల.. మృదువుగా మారతాయి. మాంగనీస్ పైనాపిల్స్ లో ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. లేజీగా అనిపించినప్పుడు పైనాపిల్ తినండి ఉత్సాహాన్ని పొందండి. పేగు సంబంధిత వ్యాధులు, డయేరియా వంటి సమస్యల నుంచి బయటపడాలంటే.. పైనాపిల్ తీసుకోవాలి. ఇందులో జీర్ణక్రియ సరిగా ఉండేలా చేసే ప్రొటీన్స్ ఉంటాయి కాబట్టి.. రెగ్యులర్ డైట్ లో పైనాపిల్ చేర్చుకోవడం మంచిది. పైనాపిల్ మాస్క్ ను మాడుకు వేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా.. మెరుస్తూ.. ఒత్తుగా ఉంటుంది. సంతానం కోరుకునే జంట రెగ్యులర్ గా పైనాపిల్స్ తినడం వల్ల.. పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. విటమిన్ సీ, బీటా కెరోటిన్, కాపర్, మినరల్స్ సంతానోత్పత్తికి తోడ్పడతాయి. ఆస్తమా నుంచి బాధపడేవాళ్లు పైనాపిల్స్ బాగా తీసుకోవాలి. ఒత్తిడి, కాలుష్యం, తక్కువ పోషకాలు ఉంటే.. ఇన్ల్ఫమేషన్ లెవల్స్ పడిపోతాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి.. పైనాపిల్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. పైనాపిల్స్ లో ఎమినో యాసిడ్ ట్రైపోటాన్ రిచ్ గా ఉండటం వల్ల.. హార్మోన్ల ఆరోగ్యానికి మంచిది. న్యూరోలాజిక్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి పైనాపిల్ లో ఉండే పోషకాలు ఉపయోగపడతాయి. వీటి ద్వారా పాజిటివ్, మూడ్ హార్మోన్స్ కి శక్తి అందుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com