ఎయిరిండియా: అకౌంట్ హ్యాక్, విమానాలన్నీ రద్దు
- March 15, 2018
ఎయిరిండియా అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఉదయం చాలా గంటల పాటు ఎయిరిండియా ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ బారిన పడినట్టు ఈ విమానయాన సంస్థ తెలిపింది. హ్యాక్ అయిన తమ ట్విటర్ అకౌంట్ @airindiain లో టర్కిష్ భాషలో మెసేజ్‌లు పోస్టు అవుతున్నాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు. తమ అకౌంట్‌లో పోస్టు అయిన హానికరమైన కంటెంట్ అంతటిన్నీ తాము తొలగించనట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్విటర్ అకౌంట్ రిస్టోర్ అయిందని వెల్లడించారు.
హ్యాకింగ్‌కు గురైన ఎయిరిండియా అకౌంట్‌లో పోస్టు అయిన ఒక మెసేజ్ ఈ విధంగా ఉంది. ''చివరి నిమిషంలో ఎంతో ముఖ్యమైన ప్రకటన. మా అన్ని విమానాలను రద్దు చేశాం. ఇప్పటి నుంచి, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో మేము ఎగరాలనుకుంటున్నాం'' అని పోస్టు అయింది. ఈ మెసేజ్ చూసిన ఎయిరిండియా ట్విటర్ ఫాలోవర్స్ అందరూ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ఇటీవల ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిరిండియా అధికారిక అకౌంట్‌లో ఈ మెసేజ్ కనిపించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. ప్రస్తుతం ఎయిరిండియా ట్విటర్ అకౌంట్‌కు 1,46,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







