టర్కీ కావాలనే రష్యా యుద్ద విమానం కూల్చి వేసింది--పుతిన్
- December 01, 2015
టర్కీ చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నదని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ మండిపడ్డారు. టర్కీ కావాలనే తమ యుద్ద విమానం కూల్చి వేసిందని, వారు చేసిన పనికి తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే టర్కీ తమ యుద్ద విమానాన్ని టార్గెట్ చేసుకునిందని ఆరోపించారు. ప్యారిస్ లో జరుగుతున్న ప్రపంచ వాతావరణ సదస్సుకు హాజరైన వ్లదిమిర్ పుతిన్ తరువాత మీడియాతో మాట్లాడారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురౌతాయనే ఉద్దేశంతోనే తమ యుద్ద విమానాన్ని టార్గెట్ చేసుకుని కూల్చేశారని, తరువాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర సానుభూతి సంపాదించారని ఆయన ఆరోపించారు. టర్కీ భూ భాగంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చెందిన ఆయిల్ పైప్ లైన్ ఉందని ఇదే సందర్బంలో గుర్తు చేశారు. ఈ ఆయిల్ పైప్ లైన్ ఇస్లామిక్ స్టేట్ మాత్రమే నిర్వహిస్తుందని వ్లదిమిర్ పుతిన్ చెప్పారు. ఆ పైప్ లైన్ ను తాము ఎక్కడ ద్వంసం చేస్తామో అని భయంతో తమ యుద్ద విమానాన్ని కూల్చి వేశారని ఆరోపించారు. కనీసం హెచ్చరికలు కూడా చెయ్యకుండా ఈ దారుణానికి పాల్పడ్డారని విమర్శించారు. తమ యుద్ద విమానాన్ని టర్కీ కూల్చి వేసిందని తాము అనవసరంగా విమర్శించలేదని, తాము చేస్తున్న ఆరోపణలకు తగిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







