బుల్లెట్ ట్రైన్: ముంబయి నుంచి అహ్మదాబాద్
- March 29, 2018
ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు కేవలం రెండుగంటల్లో చేర్చే బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టి షెడ్యూల్ టైమ్‌లో పట్టాలెక్కించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) వేగవంతం చేసింది. ముంబయి నుంచి సబర్మతికి ఫాస్ట్ ట్రైన్ రెండు గంటల్లో, రూట్‌లోని 12 స్టేషన్లలో ఆగే బుల్లెట్ ట్రైన్ రెండుగంటల 58 నిమిషాల్లో గమ్యస్ధానాలకు చేరుకుంటాయని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ అధికారులు తెలిపారు.
రద్దీ సమయాల్లో ప్రతి 20 నిమిషాలకూ ఒక బుల్లెట్ ట్రైన్ ఉంటుందని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ పీఆర్‌ఓ ధనంజయ్ కుమార్ చెప్పారు. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిమీ వేగంతో దూసుకుపోతుందని, రోజుకు 70 ట్రిప్పులు నడపాలని యోచిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్ మధ్య రైలు ప్రయాణానికి దాదాపు ఏడుగంటల సమయం పడుతుండగా, విమాన ప్రయాణానికి గంట సమయం పడుతోంది.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!