'ఐ డోంట్ నో' అంటున్న భరత్

- March 31, 2018 , by Maagulf
'ఐ డోంట్ నో' అంటున్న భరత్

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' చిత్ర ప్రమోషన్స్ జోరందుకున్నాయి. తాజాగా మూవీ నుండి సెకండ్ సాంగ్ విడుదల చేసారు. 'ఐ డోంట్ నో' అంటూ సాగే ఈ పాటని బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ పాడగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రెండో సాంగ్‌గా విడుదలైన ఈ పాట పాడినందుకు ఫర్హాన్‌కి మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కైరా అద్వానీ నాయిక. శరత్‌ కుమార్, ప్రకాష్ రాజ్‌, దేవరాజ్‌, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com