‘రాజుగారి గది 3’ ని కంఫర్మ్ చేసిన ఓంకార్.!
- April 01, 2018
బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఓం కార్ తరువాత వెండితెర మీద కూడా సత్తా చాటాడు. జీనియస్ సినిమాతో దర్శకుడిగా మారిన ఓంకార్ రాజుగారి గది సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు. అదే ఊపులో నాగార్జున లాంటి స్టార్ హీరోతో రాజుగారి గది 2 చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓంకార్ ఓ సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.
కానీ ప్రస్తుతం బుల్లితెరపై బిజీ అవుతున్నాడు ఓంకార్. సిక్త్స్ సెన్స్ అనే రియాలిటీషోకు వ్యాఖ్యతగా వ్యవహిరస్తున్నాడు. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఓంకార్ సినిమాలను పక్కన పెట్టే ఉద్దేశం లేదని తెలిపాడు. త్వరలో రాజుగారి గది 3ని ప్రారంభించబోతున్నట్టుగా ప్రకటించాడు ఓంకార్. అయితే ఈ సినిమానే బెల్లంకొండ హీరోగా తెరకెక్కిస్తాడా లేక..? మరో కథను రెడీ చేస్తాడా..? తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







