న్యూస్ రీడర్ రాధిక ఆత్మహత్య..సూసైడ్ నోట్‌లో..
- April 01, 2018
హైదరాబాద్ లో ఓ న్యూస్ ఛానల్ యాంకర్ సూసైడ్ చేసుకుంది. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానూ అంటూ సూసైడ్ లెటర్లో పేర్కొంది. అపార్ట్ మెంట్ భవనం పై నుంచి దూకి తనువు చాలించింది.
ఓ న్యూస్ ఛానల్‌లో యాంకర్ గా పనిచేస్తున్న రాధిక.. హైదరాబాద్‌లోని మూసాపేటలో నివాసముంటోంది. ఆర్నెల్ల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటోంది. భర్త దూరమవ్వడంతో కొన్నాళ్లుగా తీవ్రమానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన ఆమె.. నిమిషాల వ్యవధిలోనే అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
సూసైడ్ లెటర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







