వరల్డ్‌ కప్‌ పోటీల కోసం ఖతార్‌ ఏర్పాట్లు

- December 02, 2015 , by Maagulf
వరల్డ్‌ కప్‌ పోటీల కోసం ఖతార్‌ ఏర్పాట్లు

వరల్డ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ నిర్వహణ కోసం డిసెంబర్‌ 2, 2010లో ఖతార్‌ వేసిన బిడ్‌ విజయవంతమవడం ఫుట్‌బాల్‌ చరిత్రలోనే చారిత్రాత్మకమైనది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఈ ఘటనతో. అందుకే ప్రపంచ కప్‌ పోటీల్ని నిర్వహించడంలో కూడా తమ సత్తా చాటాలని, ప్రపంచం నివ్వెరపోయేలా 2022 వరల్డ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ పోటీల్ని నిర్వహించాలని ఖతార్‌ భావిస్తోంది. ఇప్పటికే ఆరు వేదికల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయనీ, పూర్తిస్థాయిలో ఎన్ని స్టేడియంలు నిర్మించాలన్నదానిపై చర్చలు ఇంకా జరుగుతున్నాయనీ, ఇది ఖతార్‌కి దక్కిన అరుదైన అవకాశమని సుప్రీం కమిటీ సెక్రెటరీ జనరల్‌ హసన్‌ అల్‌ తవ్వాది చెప్పారు. ఫుట్‌బాల్‌కి ఆసియాలో అద్భుతమైన ఆదరణ ఉందనీ, 'ఫిఫా'ను విజయవంతం చేయడంతోపాటు, ఫుట్‌బాల్‌పై విస్తృత ప్రచారం చేసి, ఆసియాని ఫుట్‌బాల్‌ కేంద్రంగా మార్చడానికి ప్రయత్నిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఏడేళ్ళ సమయంలో ప్రపంచం ఊహించని రీతిలో పుట్‌ బాల్‌ వరల్డ్‌ కప్‌ పోటీల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తామని ఖతార్‌ చెబుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com