ఉగ్రవాద జాబితాలో హఫీజ్ సయీద్ పార్టీ
- April 03, 2018
ఇస్లామాబాద్ : ముంబయి పేలుళ్ల కీలక సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న నేపథ్యంలో హఫీజ్ సయీద్ నేతృత్వంలోని మిల్లీ ముస్లింలీగ్(ఎమ్‌ఎమ్‌ఎల్) రాజకీయ ఫ్రంట్‌ను అమెరికా ప్రకటిత విదేశీ ఉగ్రవాద సంస్థగా పేర్కొంది.
ఎమ్ఎమ్ఎల్కు చెందిన కేంద్ర నాయకత్వ మండలిలోని ఏడుగురు నేతలను కూడా విదేశీ ఉగ్రవాదులుగా ప్రకటించింది. దీంతోపాటు తెహ్రిక్-ఈ-ఆజాది-ఈ-కశ్మీర్(టీఏజేకే)ను కూడా ఉగ్రవాద సంస్థల జాబితాలో ట్రంప్ యంత్రాంగం చేర్చింది.
అంతర్గత మంత్రిత్వ శాఖ అందించే క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సిందిగా ఎమ్‌ఎమ్‌ఎల్‌ను పాకిస్థాన్ ఎన్నికల సంఘం కోరిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అంతకుముందు ఎమ్‌ఎమ్‌ఎల్‌ను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆ పార్టీకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అంతర్గత మంత్రిత్వ శాఖ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎమ్‌ఎమ్‌ఎల్‌ను 2017లో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ సయీద్ స్థాపించాడు. పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని లాహోర్‌లో గత డిసెంబర్లో ప్రారంభించాడు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో తమపార్టీ పోటీ చేస్తుందని వెల్లడించాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







