యూఏఈ 44వ జాతీయ దినోత్సవ సందడి!

- December 02, 2015 , by Maagulf
యూఏఈ 44వ జాతీయ దినోత్సవ సందడి!


యూఏఈ 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా, ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ప్రజలకు పిలుపునిస్తూ, జాతీయ ఆర్థిక, విద్య, సామాజిక కార్యక్రమానికి సంబంధించిన 10 పాయింట్లపై ప్రచారం కల్పించేందుకు ర్యాలీలు తీయాలని కోరారు. అలాగే, దేశం కోసం ప్రాణాలకు ఒడ్డి పోరాడిన అమరవీరుల్ని స్మరించుకున్నారు. అమరవీరుల త్యాగాల్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు షేక్‌ ఖలీఫా. ప్రైమ్‌ మినిస్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ మాట్లాడుతూ, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఇతరుల పట్ల దయాగుణంతో ఉండాలనీ, అలాగే దేశం కోసం పోరాడాల్సి వస్తే ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు. అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ కమాండర్‌షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ మాట్లాడుతూ, దేశానికి యువశక్తి కీలకమనీ, దేశ అభివృద్ధిలో యువతదే అగ్ర తాంబూలమనీ అన్నారు. సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడే యువతలో దాగి ఉన్న శక్తి బయటకు వస్తుందని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com