యూఏఈ ఎన్నారైలకు స్వీట్ న్యూస్
- December 02, 2015
స్మార్ట్ సిటీస్, అమృత్ నగరాలు అనే న్యూ కాన్సెప్ట్‌తో ఇండియాలో నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలు విదేశాల్లోని ఎన్నారైలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊతం ఇచ్చింది. దుబాయ్ ట్రేడ్ సెంటర్‌లో మంగళవారం జరిగిన ప్రాపర్టీ షోలో ఎన్నారైలు సందడి చేశారు. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఈ కార్యక్రమంలో నిలిచాడు. 170 మందికి పైగా డెవలపర్స్ 45 వేలకు పైగా ప్రాపర్టీస్‌ని ఎన్నారైల ముందుంచారు. రూపాయి బలహీన పడ్డంతో, ఇన్వెస్ట్‌మెంట్ తేలికవుతుందని ఓ ఎన్నారై అభిప్రాయపడ్డారు. మంగళవారం సాయంత్రం యూఏఈ దిర్హామ్‌తో రూపాయి ధరను పోల్చినప్పుడు ఒక దిర్హామ్ విలువ 18 రూపాయల 11 పైసలుగా ఉంది. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్‌లో డెవలపర్స్ ఎన్నారైలను ఆకట్టుకున్నారు. కొందరు ఇదే వేదికపై కొనుగోళ్ళు జరపడంతో డెవలపర్స్ కూడా సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







