అట్టహాసంగా 'ఐపీఎల్' వేడుకలు ప్రారంభం
- April 07, 2018
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు అట్టహాసంగా తెరలేచింది. శనివారం ముంబైలోని వాంఖేడే స్టేడియంలో లేజర్ కాంతుల మధ్య ఐపీఎల్ వేడుకలు కలర్ఫుల్గా ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో సినీ స్టార్స్ హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, ప్రభుదేవా, తమన్నా భాటియా, జాక్వలిన్ ఫెర్నాండేజ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఏబీసీడీ మూవీలోని పాటకు బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులతో అలరించగా, అనంతరం ప్రభుదేవా తన డ్యాన్స్‌తో అభిమానుల్లో మంచి జోష్‌ను తీసుకొచ్చాడు.
ఈ క్రమంలోనే వరుణ్ ధావన్‌తో కలిసి ముక్కాలా సాంగ్‌కు ప్రభుదేవా వేసిన డ్యాన్స్ వీక్షకుల్ని అమితంగా ఆకర్షించింది. ఆపై డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ట్రోఫీని వేదికపైకి తీసుకొచ్చాడు. ఇక బాహుబాలి టైటిల్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఓకే జాను పాటతో పాటు జై లవకుశలోని స్వింగ్ జరా పాటకు చిందేశారు. ఇక బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ తన నృత్యంతో మరింత ఊపును తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఆరంభ వేడుకను ఎంజాయ్ చేశారు. ఈ వేడుకల్లో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







