కంపెనీ మూసివేత, ఓనర్ అరెస్ట్
- April 10, 2018
మస్కట్: బౌషెర్లో లైసెన్స్ లేకుండా నడుస్తోన్న ఓ కంపెనీని మస్కట్ మునిసిపాలిటీ మూసివేసింది. ఓనర్ని అరెస్ట్ చేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. పలు రకాలైన వాహనాల్ని విక్రించే ఆ కంపెనీ నిబంధనల్ని ఉల్లంఘించిందనీ, లైసెన్స్ లేకుండా విక్రయాలు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. ఓ ప్రకటనలో మస్కట్ మునిసిపాలిటీ ఈ వివరాల్ని వెల్లడించింది. కంపెనీకి నోటీసులు పంపడంతోపాటు, యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ స్పష్టం చేసింది. లైసెన్స్ లేకుండా ఎలాంటి కంపెనీలు నడపడానికి వీల్లేదని మునిసిపాలిటీ అక్రమార్కుల్ని ఉద్దేశించి హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







