అందుబాటులోకి కొత్త టూల్..ఫేస్బుక్ సమాచారం భద్రమో కాదో తెలుసుకోవచ్చు
- April 10, 2018
మెన్లో పార్క్ (కాలిఫోర్నియా): డేటా చౌర్యానికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్సల్టెన్సీ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికాకు ఎవరెవరి వ్యక్తిగత సమాచారం చిక్కిందో తెలుసుకోవడానికి ఫేస్బుక్ కొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది. ఫేస్బుక్ వినియోగదారులంతా మంగళవారం నుంచే తమ ఖాతా న్యూస్‌ఫీడ్‌లో ‘ప్రొటెక్టింగ్ యువర్ ఇన్ఫర్మేషన్’ అనే నోటిఫికేషన్‌ను గమనించొచ్చు.
ఇందులో ఉన్న లింకు ద్వారా వినియోగదారులు ఏయే యాప్‌లు వాడారు, ఆ యాప్‌లతో ఏ సమాచారం పంచుకున్నారో తెలుసుకోవచ్చు. డేటా దుర్వినియోగానికి కారణమైన ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ అనే యాప్‌కు వినియోగదారు లు లేదా వారి స్నేహితులు లాగిన్ అయ్యారో లేదో కూడా ఈ లింకు సూచించే ప్రత్యేక టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. కేంబ్రిడ్జ్ అనలిటికా బారినపడినట్లుగా భావిస్తున్న 8.7 కోట్ల మందికి ఈ వివరాలతో కూడిన సందేశం వస్తుందని ఫేస్బుక్ చెప్పింది.
బాధితులకు భిన్న సందేశాలు..
‘నా డేటా చౌర్యానికి గురైందో లేదో తెలుసుకోవడం ఎలా?’ అనే టూల్‌ను క్లిక్ చేయడం ద్వారా ఆ వినియోగదారుడి సమాచారం భద్రమో కాదో తెలుసుకోవచ్చు. ఒకవేళ సదరు వినియోగదారుడి డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా సేకరించని పక్షంలో..‘మాకున్న సమాచారం మేరకు.. మీరు, మీ స్నేహితులు డేటా దుర్వినియోగ కుంభకోణానికి కారణమైన దిస్ ఈజ్ డిజిటల్ లైఫ్‌కు లాగిన్ కాలేదు’ అనే సందేశం కనిపిస్తుంది.
ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయి వాడుకునే వెబ్సైట్లు, యాప్‌లను యథావిధిగా వాడుకోవచ్చనే సమాచారం కనిపిస్తుంది. బాధిత వినియోగదారులకు మాత్రం భిన్నమైన సందేశం కనిపిస్తుంది. ‘దిస్ ఈజ్ యువర్ డిజిటల్ లైఫ్’ యాప్‌ను నిషేధిస్తున్నట్లు ఫేస్బుక్ నుంచి వారికి సందేశం వెళ్తుంది. వారి ఖాతాలకు అనుసంధానమైన యాప్ లు ఏవీ? థర్డ్‌పార్టీలు వారికి చెందిన ఏయే వివరాల్ని చూస్తాయి? లాంటి సమాచారంతో లింకు కనిపిస్తుంది. తమ యాప్ సెట్టింగ్‌లను మార్చుకోవాలనే సూచనలు కనిపిస్తాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







