అల్జీరియాలో కూలిన విమానం.. 100 మంది మృతి!
- April 11, 2018
అల్జీర్స్: అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. వంద మంది సిబ్బందితో వెళ్తున్న మిలిటరీ విమానం బౌఫారిక్ ఎయిర్పోర్ట్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందరూ మృతి చెందినట్లు తెలిసింది. విమానంలో 200 మందికిపైగా ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 14 అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న అన్ని రోడ్లను మూసేశారు. బౌఫారిక్ మిలిటరీ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాజధాని అల్జీర్స్‌కు దగ్గర్లో విమానం కూలింది. అల్జీరియా ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







