దుబాయ్ లో మెకానిక్ లక్కు మార్చిన లాటరీ టిక్కెట్: ఆరున్నర కోట్లు
- April 11, 2018
దుబాయ్:ఉన్నఊరిలో ఎదుగూ బొదుగూ లేదు. పూట గడవడమే కష్టంగా ఉంటే నాలుగు రాళ్లు వెనకేసుకునే పరిస్థితి అసలే లేదు. స్నేహితుల సమాచారంతో ఉన్న ఊరిని, కన్నవాళ్లని వదిలి దుబాయ్ వెళ్లాడు. అక్కడ కూడా తనకు వచ్చిన బైక్ మెకానిక్ పనినే జీవనోపాధిగా ఎంచుకున్నాడు కేరళకు చెందిన పింటో పాల్ తొమ్మన. దుబాయ్ లాటరీ టిక్కెట్ల గురించి విన్న పింటోకి తనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇంతకు ముందు కూడా ఇలానే చాలా సార్లు లాటరీ టిక్కెట్లు కొన్నా ఒక్కసారిగా కూడా తగలక పోవడంతో కొంత నిరాశ చెందేవాడు. కానీ ఈ ఒక్కసారి చూడరా ఇద్దరం కలిసి ఒకే టికెట్ కొందాం అంటూ ప్రోత్సహించాడు కేరళలో ఉన్న స్నేహితుడు పింటోని. దాంతో పింటో కూడా సరేనంటూ లాటరీ టికెట్ కొన్నాడు. కొన్ని రోజులు అయిన తరువాత లాటరీ కంపెనీ వాళ్లు ఫోన్ చేసి మిమ్మల్ని అదృష్టం వరించింది. మీకు లాటరీ తగిలింది అని చెప్పారు. అది విన్న పింటో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
దుబాయ్ డ్యూటీ ప్రీ మిల్లేనియం మిలియనీరు లాటరీ ద్వారా పది లక్షల డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఆరున్నర కోట్లు గెలుచుకున్నాడు. అయితే టికెట్ ధరలో సగం డబ్బుని స్నేహితుడు ప్రాన్సిస్ సెబాస్టియన్ ఇచ్చినందువల్ల లాటరీలో వచ్చిన డబ్బుని కూడా ఇద్దరం కలిపే తీసుకుంటామంటూ తన నిజాయితీని వ్యక్తం చేసాడు. ఎనిమిదవ తరగతి నుంచి ఇద్దరం స్నేహితులమని, ఆర్థిక కష్టాలు ఇద్దరికీ ఉన్నందున ఈ ఆనందాన్ని డబ్బులనీ కూడా ఇద్దరం పంచుకుంటామని తెలిపాడు. లాటరీ తగిలిన విషయం ప్రాన్సిస్‌కు తెలియజేయడంతో మొదట నమ్మలేదన్నాడు. నిజంగానే లాటరీ తగిలింది అని చెప్పడంతో అతడు కూడా చాలా సంతోషించాడన్నాడు. ఈ వచ్చిన డబ్బులను కొంత అప్పులు తీర్చడానికి మరి కొంత సొంత వ్యాపారానికి వెచ్చిస్తానని తెలియజేసాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







