రష్యాకు ట్రంప్ వార్నింగ్..
- April 11, 2018
సిరియాకు మద్దతుగా ఉండే.. శక్తిమంతమైన.. అత్యాధునిక క్షిపణులతో స్వాగతం పలుకుతామంటూ రష్యాను ఘాటుగా హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. విష వాయువులు చిమ్ముతూ.. ప్రజల్ని, పిల్లల్ని చంపుతున్న దుర్మార్గపు శక్తులకు అండగా ఉండవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాలు రోజు రోజుకూ దిగజారుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. సిరియాపై క్షిపణి దాడులను కొనసాగిస్తామంటూ ట్రంప్ స్పష్టం చేసినట్లయ్యింది. అయితే.. ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది.
సిరియాలో జరుగుతున్న మారణకాండకు మద్దతు ఇస్తున్న రష్యా.. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న అమెరికాకూ వ్యతిరేకంగా మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. అమెరికా.. రష్యా మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని మరింత తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు స్టాక్ మార్కెట్లపైనా దీని ప్రభావం పడుతుందేమోనని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







