మీడియా సిటీ వద్ద ఫ్రీ బస్
- April 14, 2018
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) దుబాయ్‌లో ప్రయాణీకుల అవసరాల నిమిత్తం ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. దుబాయ్ మీడియా సిటీ వద్ద ఆదివారం నుంచి ఉచితంగా బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు నెలలపాటు ఈ బస్ ఉచితంగానే ప్రయాణీకులకు అందుబాటులో వుండనుంది. ఆర్టిఎ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అహ్మద్ బహ్రూెజియాన్ మాట్లాడుతూ, ఆర్టిఎ చేపడ్తున్న అనేక సంస్కరణల్లో ఇది కూడా ఒకటని, దుబాయ్ ఫ్యూచర్ యాక్సెలరేటర్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. నఖీల్ హార్బర్, టవర్ స్టేషన్, అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ దుబాయ్, దుబాయ్ కమర్షియల్ బ్యాంక్, అరోరా టవర్ వంటి ప్రాంతాల్ని దుబాయ్ మీడియా సిటీతోపాటు ప్రత్యేకంగా గుర్తించామని అక్కడి ప్రయాణీకుల మూమెంట్‌ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







