ఉద్యోగమిస్తానని ఆశచూపించి, అత్యాచార యత్నం
- April 22, 2018
ఉద్యోగం కోసం వచ్చిన ఓ మహిళపై అత్యాచార యత్నం చేశాడో ఎమిరేటీ వ్యక్తి. 46 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి, ఉద్యోగం కోసం తన వద్దకు వచ్చిన ఫిలిప్పినా మహిళను వంచించబోయాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తీవ్రమైన తోపులాట జరిగింది. అత్యంత క్రూరంగా నిందితుడు తనపై దాడి చేశాడని బాధితురాలు పేర్కొంది. జనవరి 31న ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అయితే, శృంగారం కోసం తొలుత ఆ మహిళ ఒప్పుకుందనీ, ఆ తర్వాత ఆమె తనను మోసం చేసిందనీ, ఇదంతా ఆమె కుట్రపూరితంగా చేస్తోందని నిందితుడు పోలీసులకు చెప్పాడు. కాగా ఫోరెన్సిక్ పరీక్షలో బాధితురాలిపై గాయాలు, ఆమె చెబుతున్న విషయాలకు బలం చేకూర్చుతున్నట్లుగా తేలింది. ఈ కేసు విచారణ మే 8న జరగనుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







