ఏప్రిల్‌ 27న కళాభవన్‌ ఆధ్వర్యంలో 'త్యాగరాజ మ్యూజికల్‌ ఫెస్టివల్‌'

- April 22, 2018 , by Maagulf
ఏప్రిల్‌ 27న కళాభవన్‌ ఆధ్వర్యంలో 'త్యాగరాజ మ్యూజికల్‌ ఫెస్టివల్‌'

మస్కట్‌: కళాభవన్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ అండ్‌ ఆర్ట్స్‌, త్యాగరాజ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ని ఏప్రిల్‌ 17న నిర్వహించనుంది. బౌషర్‌లోని బౌషర్‌ క్లబ్‌ హాల్‌లో ఈ ఈవెంట్‌ జరగనుంది. త్యాగరాజకి నివాళులర్పించే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. కర్నాటక సంగీతంలో త్యాగరాజకి వున్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసినవే. మస్కట్‌లో ఇండియన్‌ ఎంబసీ సెకెండ్‌ సెక్రెటరీ (కాన్సులర్‌) పికె నాయర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. తిరువారూర్‌లో 1767లో త్యాగరాజ జన్మించారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో వుంది ఈ ప్రాంతం. పలు రాగాల్లో పలు కృతిలను త్యాగరాజ కంపోజ్‌ చేశారు. భారతదేశానికి ఆయన అందించిన అమూల్యమైన సంపదగా వీటిని అభివర్ణిస్తుంటారు మ్యూజిక్‌ లవర్స్‌. ఒమన్‌లో గత 11 ఏళ్ళుగా త్యాగరాజ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ని కళాభవన్‌ నిర్వహిస్తోంది. కర్నాటక సంగీతం, ఇండియన్‌ క్లాసికల్‌ డాన్స్‌, సినిమాటిక్‌ డాన్స్‌, కీబోర్డ్‌, తబలా, మృదంగం, డ్రమ్స్‌, ఇతర వాద్య పరికరాలు, వాటితోపాటుగా ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, అలాగే కరాటే వంటి వాటిల్లో శిక్షణ ఇస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com