మే 17న రమదాన్: కువైటీ ఆస్ట్రనామర్ అంచనా
- April 22, 2018
పవిత్ర రమదాన్ మే 17న రావొచ్చునని కువైటీ ఆస్ట్రనామర్ అంచనా వేశారు. కువైట్‌లో క్రిసెంట్ మూన్‌ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లేదు. ఇది కేవలం టెలిస్కోప్ ద్వారా మాత్రమే కనిపిస్తుంది. వెస్ట్రన్ అరబ్ వరల్డ్ మాత్రం క్రిసెంట్ మూన్‌ని తిలకించే అవకాశం వుందని ఆస్ట్రనామర్ అదెల్ అల్ సాదౌన్ చెప్పారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. ఈ ఉపవాస దీక్షలు ఆరోగ్యానికీ మేలు చేస్తాయని పలువురు వైద్యులు వెల్లడిస్తున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం ఉపవాస దీక్షల పట్ల అప్రమత్తంగా వుండాలి. వైద్యుల సూచన మేరకు వారు ఉపవాస దీక్షలు చేయాల్సి వుంటుంది. వేసవి కావడంతో, సుమారు 15 గంటల పాటు ఉపవాస దీక్షలు కొంత కష్టతరమే. అయినప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో చేసే ఉపవాస దీక్షలతో తమకు మేలు జరుగుతుందని ముస్లింలు భావిస్తుంటారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







