సినీ నిర్మాత ఎస్. గోపాల్‌రెడ్డి తనయుడి అనుమానాస్పద మృతి
- May 07, 2018
నెల్లూరు: బాలకృష్ణ హీరోగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎస్. గోపాల్‌రెడ్డి తనయుడు భార‍్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నెల్లూరి జిల్లా వాకాడు మండలం కంబలి వద్ద సముద్రంలో భార్గవ్ మృతదేహం కొట్టుకు వచ్చింది. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. భార‍్గవ్ రెడ్డి మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఎలా చనిపోయాడనే దాని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయాడా, మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
కొడుకు భార‍్గవ్ పేరు మీదే భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్‌ను స్థాపించిన గోపాల్ రెడ్డి.. బాలకృష్ణ, కోడి రామకృష్ణలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 2008లో గోపాల్‌రెడ్డి మరణం తరువాత ఆయన కుటుంబసభ్యులెవరు ఇండస్ట్రీలో కొనసాగలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..