ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నఆటగాడికి మరో అరుదైన అవకాశం
- May 07, 2018
యువ క్రికెటర్ శ్రేయస్ మరో జాక్‌పాట్ కొట్టేస్తున్నాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఈ ఆటగాడిని ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడడానికి సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెలలో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌కి కోహ్లీ స్థానంలో శ్రేయస్‌ని ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. ఇదే జరిగితే శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో చోటు సంపాదించుకున్నట్లే. కోహ్లీ జూన్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ వెళుతున్నాడు. కౌంటీలో ఆరు మ్యాచ్‌లు ఆడేందుకు సర్రే జట్టుతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. జులైలో భారత జట్టు ఇంగ్లండులో పర్యటించనున్నందున కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ కారణంగానే ఆఫ్ఘాన్‌తో జరిగే మ్యాచ్‌కు కోహ్లీ దూరమవుతున్నాడు. దీంతో శ్రేయస్ పేరు తెరపైకి వచ్చింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ శ్రేయస్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..