పుచ్చకాయ తింటే పురుషుల్లో...
- May 07, 2018
వేసవిలో ఉష్ణతాపాన్ని తీర్చడానికి సమృద్దిగా లభించేవి పుచ్చకాయలు. అధిక శాతం నీటిని కలిగి ఉండే పుచ్చకాయ తినడం ఆరోగ్యరీత్యా చాలా మంచిది. వేడి నుండి తప్పించుకోవడానికి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, సలాడ్స్ వంటి చల్లటి పదార్థాలు అతిగా తినడంకన్నా పుచ్చకాయ తినడం అన్ని విధాల మేలు. ఈ పుచ్చకాయ వల్ల ఆరోగ్యానికి జరిగే మేలేంటో చూద్దాం.
1. పుచ్చకాయలో బి, సి విటమిన్లు లభిస్తాయి. అంతేకాకుండా సియాసిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ లభిస్తాయి.
2. పుచ్చకాయ తినడం వల్ల నోరు ఎండిపోవడం, అతిగా దాహం వేయడం లాంటివి తగ్గుతాయి. శరీరంలో ఉండే వేడి తగ్గి చలువ చేస్తుంది.
3. ఎండవేళ బయటకు వెళ్లినప్పుడు పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. దీన్ని తినడం వల్ల మూత్రపిడాల పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని మెరుగుపరిచే శక్తి పుచ్చకాయకు ఉంది.
4. పుచ్చకాయ మగవారిలో ఏర్పడే అంగస్తంభన సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది ఒక న్యాచురల్ వయాగ్రాలా పనిచేస్తుంది.
5. రక్తంలో ఏర్పడే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతలను బ్యాలెన్స్ చేస్తుంది. శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుండి కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
6. పుచ్చకాయ పురుష హార్మోన్లని పెంచుతుంది. దీనిలో ఉండే లైకోపిన్ అనే పదార్థం పురుషుల్లోని వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతాయి.
7. పుచ్చకాయ విత్తనాలలో మనకు తెలియని ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఈ విత్తనాలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, మాంగనీస్, జింక్‌లతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్స్, అమీనో ఆమ్లాలు లభిస్తాయి.
8. ఈ గింజలలో ఉండే కాపర్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి పుచ్చకాయ గింజల్ని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..