రూపాయి బిళ్ల:

మనుషుల్లేని ఈ అగాధంలో 
నాకు పనేంటి?

లోకం మొత్తాన్ని నా చుట్టూ
తిప్పుకోవాల్సిన నేను
ఇక్కడ పడ్డానేమిటి?

ఎందరికో ప్రాణం అయిన నేను
ఇక్కడుండి ప్రయోజనం ఏమిటి?

జాలరి వలకి కూడా
చిక్కనంత అగాధంలో 
కూరుకుపోవల్సిందేనా?

ఇక మానవ కరస్పర్శ లేకుండా
కాలం చెల్లకుండానే
కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా?

అనుకుంటోంది-

బ్రిడ్జ్ మీద వెళ్తున్న
రైలు కిటికీలోంచి
గోదాట్లోకి విసిరివేయబడ్డ
రూపాయి బిళ్ల

- సిరాశ్రీ

Back to Top