జెడ్డా:అనుమానితుడ్ని కాల్చి చంపిన సెక్యూరిటీ ఫోర్సెస్‌

జెడ్డా:అనుమానితుడ్ని కాల్చి చంపిన సెక్యూరిటీ ఫోర్సెస్‌

జెడ్డా:సౌదీ సెక్యూరిటీ ఫోర్సెస్‌, ఖాలిద్‌ అల్‌ షాహ్రి అనే అనుమానితుడ్ని కాల్చి చంపాయి. మార్చిలో పోలీస్‌ చెక్‌ పాయింట్‌పై దాడి కేసులో ఖాలిద్‌ అల్‌ షాహ్రి నిందితుడని ఇంటీరియర్‌ మినిస్ట్రీ పేర్కొంది. మినిస్ట్రీ అధికార ప్రతినిథి మేజర్‌ జనరల్‌ మన్సౌర్‌ అల్‌ టుర్కి మాట్లాడుతూ, నలుగురు సెక్యూరిటీ సిబ్బంది ఆ నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు అటాకర్స్‌ని అరెస్ట్‌ చేయగా, మూడో వ్యక్తి ఎదురు కాల్పుల్లో మరణించాడు. విచారణలో భాగంగా నిందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన భద్రతాదళాలకు అల్‌ షాహ్రి, అల్‌ ఓహ్దా విలేజ్‌లోని తన ఇంట్లో వున్నట్లు ఆచూకీ దొరికింది. లొంగిపోవాల్సిందిగా భద్రతాదళాలు హెచ్చరించినా, అల్‌ షాహ్రి ఎదురుదాడికి దిగగా అతన్ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. తీవ్రంగా గాయపడ్డ అల్‌ షాహ్రిని ఆసుపత్రికి తరలించగా, అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 

 

Back to Top