ఇండోనేషియా:బద్దలైన మెరపి అగ్నిపర్వతం
- May 11, 2018
జకార్తా: ఇండోనేషియాలోని జావాద్వీపంపై గల మెరపి అగ్నిపర్వతం శుక్రవారం ఉదయం బద్దలైంది. బిలం నుంచి 5500 మీటర్ల ఎత్తున బూడిద, పొగ ఎగసిపడుతున్నాయి. 16,400 అడుగుల ఎత్తున బూడిద ఎగసిపడుతుండటంతో, పర్వతానికి 30 కిమీ దూరంలోని ఇండోనేషియా సాంస్కృతిక రాజధాని యోగ్యాకర్తా సైతం ధూళితో నిండిపోయింది. దేశంలో అంతర్జాతీయ విమాన సేవలు రద్దయ్యాయి. 2010లో ఇదే అగ్నిపర్వతం పేలడంతో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,80,000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. పేలిపోనున్న హవాయి అగ్ని పర్వతం లాస్ఏంజెలెస్: హవాయిలో గురువారం నుంచి లావాను వెదజల్లుతున్న కిలోయియా అగ్నిపర్వతం భారీగా పేలిపోవడానికి సిద్ధమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం జాతీయ ఉద్యానవనాన్ని మూసివేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







