ఎంఎస్‌టీసీలో 34 మేనేజర్ ఉద్యోగాలు: అప్లై చేయండి
- May 16, 2018
హైదరాబాద్: ఎంఎస్‌టీసీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 34 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 26 మేనేజ్‌మెంట్ ట్రైనీ, 8 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు మే 12, 2018 నుంచి మే 27, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ మేనేజర్
ఖాళీల సంఖ్య: 34
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: మే 27, 2018
జీతం వివరాలు: రూ.. 20,600 - 46,500/-
విద్యార్హత: మేనేజ్‌మెంట్ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హుమానిటీస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/సైన్స్/కామర్స్/లా/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ఇంజినీరింగ్/ఎంబీఏ/మార్కెటింగ్‌లో పీజీడీ/ ఇంటర్నేషనల్ ట్రేడ్/కంప్యూటర్ అప్లికేషన్లపై పరిజ్ఞానం లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లేదా సంస్థ నుంచి పోస్టు గ్రాడ్యూయేట్ డిగ్రీ/హెచ్ఆర్‌లో డిప్లొమా/కంప్యూటర్ అప్లికేషన్లపై పీఎంతోపాటు అవగాహన లేదా సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ తోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్: అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీఈ/ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్/ఐటీ/కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ.
వయో పరిమితి: 01.05.2018 నాటికి మేనేజ్‌మెంట్ ట్రైనీ అభ్యర్థులు 28ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ అభ్యర్థులు 30ఏళ్లు.
ఎంపిక ప్రక్రియ:
- ఆన్‌లైన్ సెలక్షన్ టెస్ట్
- షార్ట్ లిస్టింగ్
- గ్రూప్ టాస్క్/డిస్కషన్
- ఇంటర్వ్యూ
ఫ్రీ ఛార్జీలు: ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ. 500/-
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 12.05.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 27.05.2018
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







