ఇండియన్ సోషల్ క్లబ్: 3,000 బిర్యానీలు
- May 22, 2018
మస్కట్: 3,000 ప్లేట్ల హైద్రాబాదీ బిర్యానీని రెసిడెంట్స్ అలాగే సిటిజన్స్‌కి అందించనున్నారు. ఇండియన్ సోషల్ క్లబ్‌కి చెందిన దక్కని వింగ్, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో ఇఫ్తార్ మీల్లో భాగంగా ఈ ఏర్పాట్లు చేశారు. మే 25న క్లాక్ టవర్ - సిబిడి వద్ద ఈ బిర్యానీ పంపకం వుంటుంది. 2002 నుంచి రమదాన్ సందర్భంగా ఇఫ్తార్ని అందిస్తూ వస్తోంది ఇండియన్ సోషల్ క్లబ్‌తో కలిసి హైదరాబాదీ కమ్యూనిటీ. ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా తమవంతుగా ఇఫ్తార్ మీల్స్ ఏర్పాటు చేస్తున్నామనీ, ఇదొక దైవ కార్యంగా భావిస్తున్నామనీ, మానవీయ కోణంలో ఇఫ్తార్ మీల్స్ ఏర్పాటు చేస్తుండడం ఆనందంగా వుందనీ నిర్వాహకులు తెలిపారు. మస్కట్‌లోని పలు రెస్టారెంట్లనుంచి బిర్యానీని సేకరిస్తున్నారు. హైద్రాబాదీ బిర్యానీ ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పేదేముంది? ఒమన్‌లో భారత బ్రాండ్ అంబాసిడర్ ఇంద్రా మణి పాండే కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!







