కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- November 07, 2025
కువైట్: టూరిస్టిక్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ (TEC) వింటర్ వండర్ల్యాండ్ కువైట్ నాల్గవ సీజన్ను అధికారికంగా ప్రారంభించింది. ఇది కువైట్ లోని అత్యంత ప్రజాదరణ పొందిన సీజనల్ ఆకర్షణలలో ఒకటిగా ఉందని TEC యాక్టింగ్ మార్కెటింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అల్-రఫియా తెలిపారు.
ఈ సంవత్సరం ఎడిషన్లో అన్ని వయసుల వారికి అనువైన 70 కి పైగా రైడ్లు మరియు ఆకర్షణలు ఉన్నాయని చెప్పారు. కొత్తగా పెద్ద బహిరంగ స్కేటింగ్ రింక్, రెండు నేపథ్య సాహసం మరియు భయానక కోటలు, అలాగే సీజన్ అంతటా కాన్సర్ట్ లు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
వింటర్ వండర్ల్యాండ్ ఒక కీలకమైన సీజనల్ పర్యాటక కేంద్రంగా మారిందని, కువైట్ మరియు పొరుగు దేశాల నుండి సందర్శకులను ఆకర్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు వ్యాపార మరియు పెట్టుబడి అవకాశాలను అందించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తోందని వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







