'డాక్టర్ సత్యమూర్తి' పాటలు విడుదల
- May 24, 2018
రెహమాన్ కథానాయకుడిగా గతంలో వచ్చిన '16'లో పోలీసు ఆఫీసర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తాజాగా తమిళంలో విజయవంతమైన 'డాక్టర్ సత్యమూర్తి'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. యశ్వంత్ మూవీస్ పతాకంపై డి వెంకటేష్ అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ సెంథిల్ నాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈరోజు (గురువారం) ఉదయం హైదరాబాద్ లో డాక్టర్ సత్యమూర్తి ఆడియో ఆవిష్కరణ జరిగింది. ప్రముఖ జర్నలిస్ట్ పసుపులేటి రామారావ్ మొదటి పాటను విడుదల చెయ్యడం జరిగింది. చిత్రంలోని మిగితా పాటలను తెలుగు జర్నలిస్ట్ లు విడుదల చెయ్యడం జరిగింది. ఆడియో ఆవిష్కరణ వేడుకలో చిత్ర ట్రైలర్ ను విడుదల చెయ్యడం జరిగింది. ట్రైలర్ చూసిన అందరు బాగుందని చెప్పడం విశేషం.
ప్రస్తుతం డబ్బింగ్, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాత వెంకటేష్ చెప్పడం జరిగింది. 16 తరువాత రెహమాన్ వైవిధ్యంగా ఈ చిత్రంలో కన్పిస్తాడని, అతని పాత్ర సరికొత్తగా ఉంటుందని సమాచారం. సురేష్, అతిథి గురురాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా శరవణ పాండ్యన్, సంగీతం ప్రేమ్‌కుమార్, ఎడిటింగ్ ఎస్‌పి అహ్మద్, నిర్మాత డి వెంకటేష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఆర్.సెంథిల్ నాథన్.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







